వైసీపీ నేతల రాక అంటే ఇష్టం లేకే తిరుమలో వెంకటేశ్వరస్వామి వర్షాలు కురిపించాడని.. కడప జిల్లాను తుడిచిపెట్టేశాడని పవన్ ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజలకు సాయం చేయాలనుకునేవారు వైసీపీని చూసి ఆలోచిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి డబ్బులిస్తే ప్రజలకు చేరేది కష్టమేనని పవన్ విమర్శించారు. వైసీపీ కార్యకర్తలు ఎక్కవ చేస్తే ఎదురుతిరగాలని పిలుపునిచ్చారు.