Pawan fire on YCP: విశాఖ ఉక్కును కాపాడుకునే బాధ్యత అందరిదీ అందన్నారు పవన్ కళ్యాణ్.. తాను ఒక్కడినే పోరాటం చేస్తే ఏదీ సాధ్యం కాదన్నారు. అయితే కేంద్రంపై నిప్పులు చెరుగుతారనుకున్న పవన్.. ప్రధానంగా వైసీపీనే బాధ్యలుగా చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో కూర్చున్న కేంద్రం పెద్దలకు మన కష్టాలు ఏం తెలుస్తాయి అన్నారు. ఢిల్లీ పెద్దలకు మన కష్టాలు తెలియాచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అన్నారు..
మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నం వచ్చిన పవన్ కళ్యాణ్.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపారు.. ఈ సందర్బంగా జరిగిన భారీ బహిరంగ సభలో రాష్ల్ర్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు.. వైసీపీ నేతల మాటలకు అర్థాలే వేరయా అన్నారు.. ఒక మాట చెప్పి.. మరో పని చేయడం వైసీపీకి అలవాటు అయిపోయిందన్నారు పవన్..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కులాలు, వర్గాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ముఖ్యంగా అధికార పార్టీదే ప్రధాన బాధ్యత అన్నారు.. అందుకే వైసీపీ వారం రోజుల డైడ్ లైన్ విధించాను అన్నారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎలా అడ్డుకుంటున్నాము అన్నదానిపై వైసీపీ అఖిల పక్షం ఏర్పాటు చేయాలన్నారు.. దానికోసం వారం రోజులు డెడ్ లైన్ పెడుతున్నామన్నారు. అప్పటికే వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోపోతే తాను ఏం చేస్తాను అన్నది చెప్పాను అన్నారు.
మనకు ఉన్న 25 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. కేవలం పార్లమెంట్ కు కాఫీలు తాగి కబుర్లు చెప్పుకోడానికి వెళ్తున్నారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఎవరి దానం వల్ల రాలేదని.. పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను మరోసారి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది అన్నారు. తనకు ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజాబలం ఉంది కాబట్టే.. కేంద్ర పెద్దలు అపాయింట్ మెంట్ ఇస్తన్నారని గుర్తు చేశారు.
తనకు ముందడుగు వేయడం తప్ప.. వెనకడుగు వేయడం తెలీదు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే.. విశాఖ సర్క్యూట్ హౌస్ అమ్మేసినట్టు.. స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మేస్తారని మండిపడ్డారు. అందుకే అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ప్రతి రాజకీయ పార్టీ మద్దతుగా నిలవాలని పవన్ కోరారు. స్టీల్ ప్లాంట్ సమస్య తన ఒక్కడిదే కాదన్నారు పవన్..