ఏపీ సీఎంగా ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేస్తా : జగన్

దేవుడి దయ, ప్రజల దీవెన వల్లే ఏపీలో వైసీపీ సంచలన విజయం సాధించిందన్నారు వైఎస్ జగన్. ఫలితాల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన..ఏపీలో చరిత్రలో ఇది నూతన అధ్యాయమని చెప్పారు. ఈ నెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు. ఏడాది లోపే బెస్ట్ సీఎం అని ప్రజలందరి చేత అనిపించుకుంటానన్న జగన్..నవరత్నాల అమలే తన లక్ష్యమని స్పష్టంచేశారు.