HEMA MALINI THE PARTY LEADER WHO IS SURE THAT THE BJP WILL WIN IN UTTAR PRADESH SNR
యూపీ ఎన్నికల ఫలితాల్లో జరిగేది అదే.. జోస్యం చెప్పిన బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్
Hema Malini: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు ఆపార్టీ నాయకురాలు హేమమాలిని. రాష్ట్రంలో , కేంద్రంలో బీజేపీ అందిస్తున్న సంక్షేమ పాలనే అందుకు నిదర్శనం అన్నారు. మెజార్టీ స్థానాల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.
2022అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మరోసారి గెలిచేది భారతీయ జనతా పార్టీయేనని స్పష్టం చేశారు ఆపార్టీ నాయకురాలు, సినీ నటి హేమమాలిని.
2/ 9
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అత్యంత సునాయాసంగా విజయం సాధిస్తుందని హేమమాలిని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యోగీ సర్కారు, దేశంలో మోదీ పాలన ఫలితాలపై ప్రభావం చూపిస్తాయని చెప్పారు.
3/ 9
ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు బీజేపీ ప్రభుత్వం సురక్షితమైన వాతావరణాన్ని కల్పించదన్నారామె. గడిచిన ఐదేళ్ల బీజేపీ పాలనలో ప్రజల జీవితాలు ఎంతో మెరుగుపడ్డాయని చెప్పారు హేమమాలిని.
4/ 9
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో ఎన్నికలు జరిగాయని..గతంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవన్నారు. తాను గత 20సంవత్సరాలుగా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడల్లా చూశానని చెప్పారు హేమమాలిని.
5/ 9
చాలా గ్రామాల్లో పేదల జీవన పరిస్థితులు అత్యంత దుర్బరంగా ఉండేవన్నారు. హెలికాప్టర్లో వచ్చి ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు.
6/ 9
బీజేపీ పాలనలో ప్రజలు చాలా సౌకర్యంగా, సుఖంగా జీవిస్తున్నారని చెప్పారు హేమమాలిని. ఆ నమ్మకంతోనే ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వమే గెలుస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.
7/ 9
కచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని హేమమాలిని స్పష్టం చేశారు. యూపీలో బీజేపీ గెలుపు విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
8/ 9
ఈనెల 10నుంచి మార్చి 7వ తేది వరకూ ఏడు దశల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ఎన్ని విడతలుగా జరిగినా గెలిచేది భారతీయ జనతా పార్టీయేనని చెప్పారు హేమమాలిని.
9/ 9
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది బీజేపీ. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని మరోసారి గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు ఆ పార్టీ నేతలు.