PICS: మంత్రి హరీష్ రావు శ్రమదానం.. పారిశుద్ధ్య పల్లెలే లక్ష్యం

సిద్దిపేటలోని పల్లెలను పరిశుభ్రంగా మార్చేందుకు మంత్రి హరీష్ రావు కంకణం కట్టుకున్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను క్లీన్ చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. సిద్దిపేటలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి శ్రమదానం చేశారు మంత్రి హరీష్ రావు. చెత్తను తొలగించి.. శిథిలావస్థలో ఉన్న గోడలను కూల్చి.. పారిశుద్ధ్యంపై గ్రామస్తుల్లో అవగాహన కల్పించారు.