గత కొంతకాలంగా ఆమె శస్త్ర చికిత్స కారణంగా అన్నింటికీ దూరంగా ఉన్నారు. ఇటు కీలకమైన తిరుపతి ఉప ఎన్నికముందు అలా జరగడం ఆమెను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అటు తనకు ఎంతో ఇష్టమైన జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోలకు దూరవ్వడంతో కాస్త ఆవేదనకు గురయ్యారు. ఇఫ్పుడు పూర్తిగా కోలుకోవడంతో ఇటు రాజకీయంగా, అటు బుల్లి తెరపైనా యాక్టివ్ అవుతున్నారు రోజా.
ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడడంతో ఇక జబర్థస్త్ రీ ఎంట్రీకి ఇదే సరైన సమయం అని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలాకాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగిన రోజా ఆ తర్వాతి కాలంలో అత్త అమ్మ పాత్రలు కూడా చేశారు. అయినా వాటిల్లో లేని ఆనందం జబర్ధస్త్ ద్వారా వచ్చిందని రోజా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.