బుల్లి తెరపై ఎమ్మెల్యే రోజా నవ్వులు మిస్ అయ్యాం అని బాధపడుతున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె జబర్థస్త్, ఎక్సట్రా జబర్థస్త్ రెండు షోల్లో తిరిగి టీవీపై కనిపించనున్నారు. రాబోయే ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ లో రోజా పాల్గొన్నట్టు సమాచారం. శస్త్రచికిత్స తరువాత విరామం తీసుకుంటున్న ఆమె మళ్లీ జబర్థస్త్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమెకు త్వరలోనే మంత్రి పదవి వస్తోంది. ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందని.. ఆమె ఆశ త్వరలోనే నెరవేరబోతోందని.. అందుకే ఆమె జబర్థస్త్ కు దూరంగా ఉంటారని ఆమె సన్నిహితులే చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా భయపెడుతున్న రోజుల్లో.. మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతుందని సమాచారం. దీంతో మంత్రి పదవి అధికారికంగా ప్రకటించే వరకు జబర్థస్త్ లో కొనసాగలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తెలుగు బుల్లితెరపై జబర్థస్త్ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షోకు లేదనే చెప్పాలి. శ్యాం ప్రసాద్ రెడ్డికి చెందిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో చాలామంది కంటెస్టెంట్స్ మారారు, జడ్జిలు మారారు కానీ షో మాత్రం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది.
అయితే తెలుగు టెలివిజన్ చరిత్రలో నెంబర్ వన్ షో అనిపించుకుంటున్న జబర్దస్త్ షో మొదలైన తర్వాత ఆమె అందులో జడ్జిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ షో ద్వారా ఆమెకు మరింత క్రేజ్ లభించింది. రాజకీయాల్లో సైతం యాక్టివ్ గా ఉండే ఆమె ఎమ్మెల్యే కావడానికి ఈ జబర్దస్త్ కారణం అని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
తాజాగా ఎక్స్తాట్రా జబర్దస్త్ ప్రోమోలో రాకింగ్ రాకేష్ స్కిట్ చర్చనీయాంశంగా మారింది. మరి కొన్నేళ్ల తరువాత జబర్దస్త్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది అన్న ఊహతో ఆయన ఒక స్కిట్ చేయగా ఈ స్కిట్ సందర్భంగా జబర్దస్త్ లోని అందరూ ఎమోషనల్ అయ్యారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులు తమకు జబర్దస్త్ కి ఉన్న అనుబంధం అలాగే జబర్దస్త్ కు తమకు ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పుకొచ్చారు. (MLA Roja/Twitter)
ఇదే సమయంలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ కూడా ఆసక్తికరంగా స్పందించారు.. తాను హీరోయిన్ గా మారి దాదాపు 27 ఏళ్లు అయిందని, అయితే ఈ 27 ఏళ్లు తనకు ప్రేక్షకుల నుంచి ఎంత ప్రేమ దక్కుతుందో తనకు తెలిసేది కాదని కానీ మొట్టమొదటిసారి జబర్దస్త్ ద్వారా ఎంత ప్రేమ దక్కుతుంది అనేది కళ్లారా చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఆమె ఎమోషన్ చూస్తే త్వరలోనే ఆమె ఆ షో నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శస్త్ర చికిత్స తరువాత పూర్తిస్థాయిలో కోలుకున్న ఆమె.. కరోనా భూతం కారణంగా ఇంటి దగ్గర నుంచి రాజకీయ వ్యవహరాలు, నియోజకవర్గాల వ్యవహారాలు చూసుకుంటున్నారు. త్వరలోనే కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కరోనా కరాణంగా ఆ పదవి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు జబర్థస్త్ లో కొనసాగాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.