GHMC ELECTIONS RESULTS 2020 TRS LIKELY TO ELECT SINDHU REDDY AS MAYOR SK
GHMC Elections Results 2020: సింధు రెడ్డి.. జీహెచ్ఎంసీ కాబోయే మేయర్ ఈమేనా..?
GHMC elections Results 2020: జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో ఆశించినంత ఫలితాలను టీఆర్ఎస్ (TRS) సాధించలేదు. 100 సీట్లు వస్తాయని భావించినా.. 55కే పరిమితమయింది. బీజేపీకి 48, ఎంఐఎంకి 44, కాంగ్రెస్‌కు 2 సీట్లు వచ్చాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఐతే ఎంఐఎం సహకారంతో టీఆర్ఎస్ మళ్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.
జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఈసారి మహిళలకే రిజర్వ్ అయిన నేపథ్యంలో.. ఎవరిని వరిస్తుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఐతే మేయర్ రేస్‌లో సింధు ఆదర్శ్ రెడ్డి రేస్‌లో ముందున్నారు. భారతినగర్ డివిజన్లో టీఆర్ఎస్ తరపున ఈమె విజయం సాధించారు.
2/ 21
సింధురెడ్డినే టీఆర్ఎస్ ఎంపిక చేసే అవకాశముందని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి పేరు వినిపిస్తున్నప్పటికీ.. హైకమాండ్ సింధురెడ్డికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
3/ 21
2016 ఎన్నికల్లోనూ సింధూరెడ్డి భారతి నగర్ డివిజన్ నుంచి గెలిచారు. వరుసగా రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలిచినందున ఈమెనే.. ఈసారి మేయర్ చేయాలని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోంది.
4/ 21
అంతేకాదు భారతినగర్ డివిజన్ ఫలితం వెలువడిన కాసేపటికే.. సింధు రెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సింధు రెడ్డే కాబోయే మేయర్ అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
5/ 21
సింధు భర్త పేరు ఆదర్శ్ రెడ్డి. ఆయన వ్యాపారవేత్త. ఇక ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డికి సింధూ కోడలు.
6/ 21
సింధు రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతి నగర్ డివిజన్‌కు తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ఇంచార్జిగా వ్యవహరించారు.