Photos : టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజుల్లో.. గతాన్ని గుర్తుచేసుకున్న హరీష్..

సిద్ధిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గతాన్ని గుర్తుచేసుకున్నారు. 2001లో TRS స్థాపించిన నాడు ఎక్కడ పార్టీ కార్యాలయం పెట్టుకోవాలన్నా వీలు లేని పరిస్థితిని ఎదుర్కొన్నామని చెప్పారు. జలదృశ్యంలో పార్టీ కార్యాలయం పెట్టుకుంటే నాటి పాలకులు బలవంతంగా తొలగించారని అన్నారు.