FIRST TIME MP NUSRAT JAHAN GETS MARRIED IN TURKEY MISSES TAKING OATH AS MP MS
Photos : ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయక ముందే పెళ్లి పీఠలు ఎక్కిన బెంగాలీ భామ నుస్రత్ జహాన్..
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున మొదటిసారి ఎంపీగా గెలిచిన నుస్రత్ జహాన్ పెళ్లి చేసుకున్నారు. నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తతో బుధవారం టర్కీలోని బొడ్రమ్ నగరంలో ఆమె వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నుస్రత్ బసిర్హత్ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరుపున భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు.
2/ 6
నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తతో బుధవారం టర్కీలోని బొడ్రమ్ నగరంలో నుస్రత్ జహాన్ వివాహం జరిగింది.
3/ 6
నుస్రత్ ట్విట్టర్లో షేర్ చేసిన పెళ్లి ఫోటో..
4/ 6
వివాహం కారణంగా పార్లమెంట్లో నుస్రత్ ఇంకా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయలేదు.
5/ 6
నుస్రత్ స్నేహితురాలు, టీఎంసీ తరుపున మొదటిసారి ఎంపీగా గెలిచిన మరో నటి మిమి చక్రవర్తి కూడా ప్రస్తుతం టర్కీలోనే ఉన్నారు. నుస్రత్ వివాహ వేడుకలో ఆమె పాల్గొన్నారు.
6/ 6
జులై 4న నుస్రత్ జంట కోల్కతాలో తమ రిసెప్షన్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖ బెంగాలీ నటులతో పాటు రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.