వారణాసిలో మోదీతో పోటీ పడుతున్న ఒకే ఒక్క పసుపు రైతు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో నిజామాబాద్ రైతులకు షాక్ తగిలింది. 25 మంది రైతులు నామినేషన్ దాఖలు చేయగా, అందులో 24 నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. ఇస్తారి అనే రైతు నామినేషన్‌ను మాత్రమే ఎన్నికల అధికారులు ఆమోదించారు.