నవంబరు 2న వెలువడిన హుజురాబాద్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఆయన 23,855 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈటల రాజేందర్ మొత్తం 1,07,022 ఓట్లు పోలవగా.. గెల్లు శ్రీనివాస్‌కు 83,167 మంది ఓటు వేశారు.