ఎన్నికల్లో భారీ విజయాలు సాధించడంలో దిట్టగా పేరున్న హరీశ్ రావు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో గతకంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు ఎక్కడ జరిగినా రంగంలోకి దిగి టీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు రాబట్టే హరీశ్ రావుకు.. కీలక సమయంలో దుబ్బాక ఉప ఎన్నిక ఓ పరీక్ష కానుంది.
ఇక షెడ్యూల్ కంటే ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ముందుగానే ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా ఇచ్చింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లు సాధించడంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఈసారి కూడా అన్నీ తానై గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించబోతున్నారు.