ఇన్నాళ్లూ ఆ కోరిక తీరలేదు. ఇదే ఆఖరి అవకాశం వచ్చే ఎన్నికల్లోనైనా తన కల నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు గ్రౌండ్ ప్రీపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన గ్రౌండ్ ప్రీపేర్ చేసుకుంటే ఎమ్మెల్యే రోజాకు ఏం సంబంధం అనుకుంటున్నారా? ఆయన గ్రౌండ్ ప్రీపేర్ చేసుకుంటుంది రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన రోజా నియోకవర్గంలోనే.
రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ప్రత్యేక్ష ఎన్నికల్లో పోటీ చేసిన నెగ్గలన్న కొరిక నారాయణకు అలానే ఉండిపోయింది. గతంలో చాలా ఎన్నికల్లో పోటీ చేసిన ఫలితం దక్కలేదు. 1999 తో తిరుపతి అసెంబ్లీకి, తిరుపతి మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసిన ఆయనకు అనుకూలమైన ఫలితాలు రాలేదు. 2014 ఎన్నికల్లో తెలంగాలణలో ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.
స్థానికంగా ఉన్న ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు.... వరసగా నగరి, తిరుపతి, చిత్తూరు కేంద్రంగా దర్నాలు ఆందోళనలతో రచ్చ చేస్తోన్నారు. గత కొద్ది రోజులు క్రితం ఉపాధి కూలిలతో కలిసి రోజాంత వాళ్లతో పని చేశారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న ఒక ప్యాక్టీరిని తెరిపించాలని ఆందోళనలు కూడా చేస్తోన్నారు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో సీపీఐ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుందో ఇప్పుడే చెప్పలేం అయినప్పటికి నారాయణ తన గ్రౌండ్ ప్రీపేర్ చేసుకోవడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. మరో వైపు రోజా వర్గం మాత్రం నారాయణ గ్రౌండ్ వర్క్ ను అంత సీరియస్ గా తీసుకోవడం లేదు.. అయితే ఆయనకు టీడీపీ లేదా జనసేన లాంటి పార్టీలు సహకరిస్తే.. రోజాకు కాస్త ఇబ్బంది తప్పకపోవచ్చనే ప్రచారం కూడా ఉంది..