కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.4వేల నిరుద్యోగ భృతి: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు భృతి ఇస్తామని ఆ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన విజయసామిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.