CONGRESS LEADER RAHUL GANDHI MAY TAKE CHARGE AS LOKSABHA OPPOSITION LEADER AHEAD PARLIAMENT MONSOON SESSION AK
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కొత్త బాధ్యతలు.. ఈ వారంలోనే కీలక నిర్ణయం ?
Rahul Gandhi: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బలమైన నాయకుడిగా నిరూపించుకునేందుక రాహుల్ గాంధీకి ఇదో మంచి అవకాశమని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ ముఖ్యనేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపడతారనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే పార్టీలోనూ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. (ఫైల్ ఫోటో)
2/ 8
అయితే పార్టీ పగ్గాలు చేపట్టడానికి ముందు రాహుల్ గాంధీకి మరో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్నాయి.(ఫైల్ ఫోటో)
3/ 8
2019 లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేతగా అధీర్ రంజన్ చౌదరి ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఆయనే ఈ పదవిలో ఉన్నారు.(ఫైల్ ఫోటో)
4/ 8
అయితే ఆయన స్థానంలో మనీష్ తివారీ, శశిథరూర్ వంటి వారిని నియమిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. కొందరు రాహుల్ గాంధీ ఈ బాధ్యలు తీసుకునే అవకాశం లేదని అంటుంటే.. మరికొందరు మాత్రం దీనిపై రాహుల్ ఇంకా ఆలోచిస్తారని చర్చించుకుంటున్నారు.(ఫైల్ ఫోటో)
5/ 8
ఈ వర్షాకాల సమావేశాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ సహా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని.. దీన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.(ఫైల్ ఫోటో)
6/ 8
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బలమైన నాయకుడిగా నిరూపించుకునేందుక రాహుల్ గాంధీకి ఇదో మంచి అవకాశమని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.(ఫైల్ ఫోటో)
7/ 8
కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేతగా ఉన్న అధీర్ రంజన్ చౌదరి బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.(ఫైల్ ఫోటో)
8/ 8
దీంతో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న రెండు పదవుల్లో ఒకటైన కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత పదవి నుంచి తప్పించి బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఆయనను తప్పించి ఆయన స్థానంలో రాహుల్ గాంధీని నియమిస్తారనే చర్చ జరుగుతోంది.(ఫైల్ ఫోటో)