తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నేతగా, రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ రూపంలో కొత్త సవాల్ ఎదురైంది.
2/ 11
రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలోనూ నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న తరువాత... బీజేపీ గేమ్ ప్లాన్ పూర్తిగా మారిపోయింది.
3/ 11
గట్టిగా పోరాడితే తెలంగాణలోనూ తమకు అధికారం దక్కుతుందనే భావనలో ఉన్న బీజేపీ... టీఆర్ఎస్ టార్గెట్గా తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టింది.
4/ 11
ఈ కారణంగానే ఒకప్పుడు ప్రధాని మోదీతో సత్సంబంధాలు కొనసాగించిన సీఎం కేసీఆర్ ఆయనకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
5/ 11
తెలంగాణ రాజకీయాల్లో తనను ఇబ్బందిపెడుతున్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త ప్లాన్ వేశారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.
6/ 11
బీజేపీకి ఎంతో కీలకమైన రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తామని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు కేసీఆర్ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
7/ 11
తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని లేకపోతే అక్కడ టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆ నేతలు కేసీఆర్ను కోరినట్టు వార్తలు వచ్చాయి.
8/ 11
ఇందుకు గులాబీ బాస్ కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం.
9/ 11
అయితే మహారాష్ట్ర ప్రాంత నేతలు సీఎం కేసీఆర్ను కలవడం సహజంగానే జరిగిందా లేక ఇది టీఆర్ఎస్ గేమ్ ప్లాన్లో భాగమా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
10/ 11
త్వరలోనే మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... అక్కడ బీజేపీని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ ఈ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
11/ 11
మహారాష్టలో టీఆర్ఎస్ పోటీ అనేది బీజేపీని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ప్లాన్ రాజకీయ వ్యూహమా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.