మెగాఫ్యామిలీలో రాజకీయ భిన్నాభిప్రాయాలు కొత్తేమీ కాదు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఓటమి చూసిన చిరంజీవి... ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తానూ కాంగ్రెస్‌లో చేరిపోయారు.
2/ 12
అయితే చిరంజీవి ఆలోచన నచ్చని పవన్ కళ్యాణ్... సొంతంగా జనసేన పార్టీని ఏర్పాటు చేసుకుని 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు.
3/ 12
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన సొంతంగా పోటీ చేయగా... ఎన్నికల్లో ఎవరికీ సపోర్ట్ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయారు చిరంజీవి.
4/ 12
ఎన్నికల తరువాత ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్... సీఎం జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
5/ 12
చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న సీఎం జగన్ నిర్ణయాలను సమర్థిస్తున్నారు.
6/ 12
రాజకీయాలకు దూరమంటూనే చిరంజీవి సీఎం జగన్ నిర్ణయాలను పదే పదే సమర్థిస్తుండటంతో... మరోసారి మెగా ఫ్యామిలీ రాజకీయంగా చీలిపోయిందనే వార్తలు జోరందుకున్నాయి.
7/ 12
ఏపీలో సీఎం జగన్ సర్కార్ తీసుకొచ్చిన దిశ చట్టాన్ని చిరంజీవి ప్రశంసించారు.
8/ 12
తాజాగా ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం చిరంజీవి సమర్థించడం విశేషం.
9/ 12
ఈ అంశంలో వపన్ కళ్యాణ్ జగన్ సర్కార్ తీరును తప్పుబట్టగా... చిరంజీవి మాత్రం జగన్ నిర్ణయం భేష్ అనడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
10/ 12
మెగాఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ మరో మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో కొనసాగుతున్నారు. జగన్ సర్కార్ నిర్ణయాలపై రాజకీయంగా పోరాటం చేస్తున్నారు.
11/ 12
అయితే చిరంజీవి మాత్రం జగన్ కీలక నిర్ణయాలకు జై కొడుతూ... పరోక్షంగా తాను తమ తమ్ముళ్ల రాజకీయ పంథాకు వ్యతిరేకమని సంకేతాలు ఇస్తున్నారు.
12/ 12
మొత్తానికి మెగా ఫ్యామిలీ మరోసారి రాజకీయంగా చీలిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.