వైసీపి ఎంపీ పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే

ఈరోజు ఒంగోలులో వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపాటు చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా హాజరయ్యారు. బలరాం కుమారుడు వెంకటేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాగుంట మాట్లాడుతూ కరణం బలారంను మా అన్నగారు అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బలరాం అక్కడికి వెళ్లడం వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని వారి ఇద్దరికీ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లనే అయన వేడుకల్లో పాల్గొన్నారని వెళ్లారని టీడీపీ నేతలు చెబుతున్నారు .