వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విశాఖపట్నం ఏపీకి పరిపాలన రాజధానిగా మారనుంది. దీంతో ఈ నగరానికి అన్ని రకాలుగా ప్రాధాన్యత పెరగనుంది.
2/ 10
ఇప్పటివరకు రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ... ఇక రాజకీయ రాజధానిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
3/ 10
అందుకే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున విశాఖ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ప్రాధాన్యత, పోటీ కూడా పెరగనుంది.
4/ 10
గత లోక్ సభ ఎన్నికల్లో విశాఖ లోక్ సభకు అన్ని పార్టీల నుంచి ప్రముఖలు బరిలోకి దిగారు.
5/ 10
జనసేన తరపున ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... ఓడిపోయినప్పటికీ గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు సాధించారు.
6/ 10
అయితే జనసేనలో పవన్ కళ్యాణ్‌కు లక్ష్మీనారాయణకు మధ్య ఏర్పడిన కొంత గ్యాప్ కారణంగా... మరోసారి ఆయనకు జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.
7/ 10
అయితే ఇటీవల ఈ విభేదాలు సమసిపోయాయి. దీంతో పవన్ కళ్యాణ్ విశాఖ విషయంలో లక్ష్మీనారాయణకే ప్రాధాన్యత ఇచ్చారు.
8/ 10
ఇటీవల విశాఖపట్నంలోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌లను నియమించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్... విశాఖ లోక్ సభ జనసేన ఇంఛార్జ్‌గా లక్ష్మీనారాయణనే నియమించారు.
9/ 10
దీంతో రాబోయే ఎన్నికల్లోనూ జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ అనే టాక్ వినిపిస్తోంది.
10/ 10
మరోవైపు జనసేనలో మళ్లీ లక్ష్మీనారాయణకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పడానికి ఇది సంకేతమనే ప్రచారం కూడా సాగుతోంది.