BOAT CAPSIZES BOAT CARRYING BJP ACTIVISTS CAPSIZES IN DAL LAKE SRINAGAR SK
BJP Boat Capsizes: బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రమాదం.. సరస్సులో పడవ బోల్తా
BJP Elections Rally in Dal Lake: జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ ఎన్నికల ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో బీజేపీ కార్యకర్తల పడవ బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న బీజేపీ కార్యకర్తలతో పాటు పలువురు జర్నలిస్టులు కూడా నీటిలో పడిపోయారు.
జమ్మూకాశ్మీర్‌లో జిల్లాఅభివృద్ధి మండలి (DDC) ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దశల పోలింగ్ ముగిసింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది.
2/ 8
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో పడవలతో బీజేపీ నేతలు ర్యాలీ తీశారు.
3/ 8
ఈ ర్యాలీలో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుఘ్ కూడా పాల్గొన్నారు.
4/ 8
ఓ పడవలో పరిమితికి మంచి ఎక్కువ మంది ఎక్కడంతో సరస్సులో బోల్తాపడింది. అందులో ఉన్న కార్యకర్తలు, జర్నలిస్టులు నీటిలో పడిపోయారు.
5/ 8
17వ ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ బృందాలు హుటాహుటిన చేరుకొని నీటిలో పడిపోయిన వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.
6/ 8
సకాలంలో రెస్క్యూ బృందాలు చేరుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. దాంతో ఇటు బీజేపీ నేతలు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
7/ 8
నీటిలో పడిపోయిన కార్యకర్తలను ముందుజాగ్రత్తగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.