BJPS BHARATI GHOSH ATTACKED BY TRINAMOOL WORKERS IN WEST BENGAL SB
Pics: కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్
పశ్చిమబెంగాల్ లోని ఘటాల్ నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారిణి భారతీ ఘోష్ కు చేదు అనుభవం ఎదురయింది. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఘోష్‌ను అక్కడున్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమె కారుపై కూడా దాడి చేశారు.
పశ్చిమబెంగాల్ లోని ఘటాల్ నియోజకవర్గంలో ఆరో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
2/ 7
బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారిణి భారతీ ఘోష్ కు చేదు అనుభవం ఎదురయింది.
3/ 7
ఎన్నికల సరళిని పరిశీలించేందుకు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఘోష్ పై కొందరు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.
4/ 7
బారతి ఘోష్ కారును కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.( ఫోటో ani ట్విట్టర్)
5/ 7
ఘోష్ కారుపై దాడి చేసి కారు అద్దాల్ని పగులకొట్టారు. (ఫోటో ani ట్విట్టర్)
6/ 7
అక్కడి నుంచి మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లగా భారతీ ఘోష్ కు అదే అనుభవం ఎదురయింది.(ఫోటో ani ట్విట్టర్)
7/ 7
టీఎంసీ మహిళా కార్యకర్తలు ఆమెపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. దీంతో భారతీ ఘోష్ కన్నీరుపెట్టుకున్నారు.