Pics: స్వీట్లు తయారీ చేస్తున్న మోదీలు... సంబరాల ఏర్పాట్లలో బీజేపీ

ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా రావడంతో బీజేపీలో అప్పుడే సంబరాలు ప్రారంభమయ్యాయి. ముంబైకు చెందిన బీజేపీ మద్దతు దారుడు అమిత్ వ్యాస్ నార్త్ ముంబై పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోపాల్ శెట్టి గెలుస్తున్నాడన్న నేపథ్యంలో స్వీట్లు తయారీ చేస్తున్నారు. ఆయన గెలుపు ప్రకటించగానే... స్వీట్లు పంచుతామని చెబుతున్నారు.