ఏపీ సీఎం జగన్, బీజేపీ మధ్య ఉన్నది మిత్రుత్వమా ? లేక శత్రుత్వమా ? అన్నది ఎవరికి అంతుచిక్కడం లేదు.
2/ 10
ఢిల్లీ పెద్దలతో సఖ్యతగానే ఉంటూ వస్తున్న సీఎం జగన్... వారి నిర్ణయాలను వ్యతిరేకించే విషయంలో మాత్రం అస్సలు వెనుకాడటం లేదనే టాక్ వినిపిస్తోంది.
3/ 10
పార్టీపరంగా బీజేపీ వైఖరి ఎలా ఉన్నా... ప్రస్తుతం ఆ పార్టీ ఎంపీగా ఉన్న టీడీపీ మాజీ నేత సీఎం రమేశ్ జగన్ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
4/ 10
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కోసం వచ్చిన సీఎం జగన్‌ను ఏకంగా హెలీప్యాడ్ దగ్గరకు వెళ్లి మరీ రిసీవ్ చేసుకున్నారు సీఎం రమేశ్.
5/ 10
ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయనతో అంతే అభిమానంగా మాట్లాడారు. ఇది చూసిన వైసీపీ నేతలు... ఎంపీ సీఎం రమేశ్ తీరు చూసి ఆశ్చర్యపోయారు.
6/ 10
అయితే బీజేపీ ఎంపీ జగన్ దృష్టిలో పడేందుకు ఇంతలా ప్రయత్నించడానికి వేరే కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
7/ 10
తన కంపెనీలకు సంబంధించి పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయని... వాటి మంజూరు కోసమే ఆయన సీఎం జగన్ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (Image:ANI)
8/ 10
అయితే సీఎం రమేశ్ సన్నిహితులు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు.
9/ 10
గతంలో కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆయన దీక్ష చేశారని... తన కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారనే కారణంగానే ఆయన ఇలా చేశారని చర్చించుకుంటున్నారు.
10/ 10
మొత్తానికి ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉండే ఎంపీ సీఎం రమేశ్‌ను జగన్ అంత ఈజీగా నమ్మరనే టాక్ వినిపిస్తోంది.