బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా...ముగిసిన అసెంబ్లీలో ఆయా పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి. ముగిసిన అసెంబ్లీలో 212 మంది పురుషులు ప్రాతినిధ్యంవహించగా...కేవలం 28 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. తాజా మాజీల్లో 134 మంది ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేషన్ లేదా అంతకు పై చదువులు చదుకున్న వారు ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో 61 సంవత్సరాలకు పైబడిన వృద్ధులు 46 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తాజా మాజీల్లో ఎమ్మెల్యేల సరాసరి ఆస్తుల విలువ రూ.3.06 కోట్లుగా ఉంది. ఆర్జేడీలో అత్యధికంగా 51 మంది కోటీశ్వరులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తాజా మాజీల్లో అత్యధికంగా ఆర్జేడీకి చెందిన 45 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసెంబ్లీలోని సగానికి పైగా సభ్యుల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయి.