ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి స్వగ్రామంలో షాక్ తగిలింది. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిపై.. టీడీపీ బలపరిచిన కొల్లూరి అనూష 800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా..యలమర్రు పామర్రు పరిధిలో ఉంది. కొడాలి నానికి స్వగ్రామంలోనే షాక్ తగలడం సంచలనంగా మారింది. ప్రస్తుతం కృష్ణాజిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో జనసేన జెండా కూడా ఎగిరింది. గుడ్లవల్లేరు నియోజకవర్గం వెణుతురుమిల్లిలో జనసేన బలపర్చిన కొప్పునేని శేషవేణి 173 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్, కొడాలి నానికి మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో ఈ గెలుపు కూడా జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.