ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తరపున సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. సినిమా టికెట్ల విషయంపై చిరంజీవి... సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు తన వద్ద కూడా ప్రస్తావించారని పేర్ని నాని అన్నారు. అలాగే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు జీవో నెం.35 మరోసారి సమీక్షించాలని తన ద్వారా పలుసార్లు ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్ని నాని వెల్లడించారు. (File: సినీ నిర్మాతలతో పేర్ని నాని)