ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం మీద అదనపు ట్యాక్స్ విధిస్తూ జీవో జారీ చేసింది. ప్రస్తుతం విధిస్తున్న ట్యాక్స్‌కు అదనంగా పన్ను విధించింది. ఏయే మద్యం ధరలు ఎంత మేర ట్యాక్స్ విధిస్తారో తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. భారత్‌లో తయారైన విదేశీ మద్యం 60 ఎంఎల్, 90 ఎంఎల్ మీద రూ.30 భారత్‌లో తయారైన విదేశీ మద్యం 180 ఎంఎల్ మీద రూ.60 భారత్‌లో తయారైన విదేశీ మద్యం 375 ఎంఎల్ మీద రూ.120 భారత్‌లో తయారైన విదేశీ మద్యం 750 ఎంఎల్ మీద రూ.240 భారత్‌లో తయారైన విదేశీ మద్యం 1000 ఎంఎల్ మీద రూ.300 భారత్‌లో తయారైన విదేశీ మద్యం 2000 ఎంఎల్ మీద రూ.750 విదేశీ మద్యం 50 - 60 ఎంఎల్ మీద రూ.30 విదేశీ మద్యం 200 - 275 ఎంఎల్ మీద రూ.60 విదేశీ మద్యం 330 - 500 ఎంఎల్ మీద రూ.120 విదేశీ మద్యం 700 - 750 ఎంఎల్ మీద రూ.240 విదేశీ మద్యం 1500/2000 ఎంఎల్ మీద రూ.750 బీర్ 330 ఎంఎల్ మీద రూ.30 బీర్ 500 ఎంఎల్ మీద రూ.30 బీర్ 650 ఎంఎల్ మీద రూ.60 బీర్ 30,000 ఎంఎల్ మీద రూ.3000 బీర్ 50,000 ఎంఎల్ మీద రూ.6000 రెడీ టు డ్రింక్ అన్నింటి మీద రూ.60 ట్యాక్స్ ఈ పెరిగిన ధరలు 2019 డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏపీలో మద్యం మీద రిటైల్ ట్యాక్స్ విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏపీలో మద్యం మీద రిటైల్ ట్యాక్స్ విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు