ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు నియోజకవర్గాల్లో రీ పోలింగ్ జరిగింది. ఆరు నియోజకవర్గాలకు గాను ఐదుచోట్ల వైసీపీ విజయం సాధించింది. ఒక చోట టీడీపీ గెలిచింది. నరసరావుపేటలోని కేసనపల్లిలో రీ పలింగ్ జరిగింది. అక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (వైసీపీ) విజయం సాధించారు. నెల్లూరు జిల్లా కోవూరులో రీ పోలింగ్ జరిగింది. అక్కడ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (వైసీపీ) విజయం సాధించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో రీ పోలింగ్ జరిగింది. వైసీపీ అభ్యర్థి కె.సంజీవయ్యను విజయం వరించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రీ పోలింగ్ జరిగింది. ఆదిమూలపు సురేష్ (వైసీపీ) గెలుపొందారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు బూత్‌ల్లో రీ పోలింగ్ జరిగింది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు లో రీ పోలింగ్ జరిగింది. అక్కడ మద్దాలి గిరిధర్ రావు (టీడీపీ) గెలుపొందారు.