ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన విషయాలపై వైసీపీ ఎంపీలకు.. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పోలవరం నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ సూచన. విభజన హామీలను ప్రస్తావించాలన్న ఎంపీలకు ఏపీ సీఎం ఆదేశం. మెట్రో కారిడార్ అంశాన్ని కేంద్రంతో చర్చించాలని సూచన కడప స్టీల్ పరిశ్రమ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలన్న జగన్ సెంట్రల్ యూనివర్సిటీ ఫండ్స్ అంశంపై ఈ సమావేశంలో చర్చ. 9, 10 షెడ్యూల్ విభజన హామీలు ప్రస్తావించాలని జగన్ సూచన. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయింపుపై సమావేశంలో చర్చ దీంతో పాటు ఇతర అంశాలపై పార్లమెంట్లో ప్రస్తావించాలని ఎంపీలకు సీఎం జగన్ ఆదేశించారు.