CM KCR-YS Jagan Mohan Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే వేదికపై మెరిశారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లికి హాజరై వధూవరులకు ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల జల వివాదం తర్వాత వీరిద్దరు నేరుగా కలుసుకోవడం ఇదే తొలిసారి.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహ వేడుకలో తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ సందడి చేశారు.
2/ 4
శంషాబాద్లో జరిగిన పెళ్లికి వెళ్లి కొంత జంటను ఆశీర్వదించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ పెళ్లి వేడుకకు ఏపీ స్పీకర్ తమ్మినేతి సీతారాం, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.
3/ 4
పెళ్లిలో కేసీఆర్, జగన్ పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించారు. ఏపీలో వరదలు, తాజా రాజకీయాలతో పాటు కుటుంబ యోగ క్షేమాల గురించి కూడా సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
4/ 4
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహ వేడుకలో తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్.