రెండున్నరేళ్లుగా సినిమాటోగ్రఫీ శాఖ సీఎం జగన్ వద్దే ఉంది. దీంతో టాలీవుడ్ నిర్మాతలు, స్టార్ హీరోలు సీఎంనే కలిసి తమ సమస్యలను వివరిస్తున్నారు. ఐతే ఇటీవల సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానం విషయంలో పేర్ని నాని కీలకంగా వ్యవహరించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఆయనే చర్చలు జరిపారు. (File: Photo)
అలాగే సీఎం జగన్ పై వచ్చిన విమర్శలకు పేర్ని నాని గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయడంలో పేర్ని నానీనే ముందుంటారు. అటు సినిమా వాళ్ల తో చర్చలు చేయడం.. ఇటు పవన్ కు గట్టిగా కౌంటర్లు ఇవ్వడంతోనే తనదగ్గరున్న శాఖను పేర్ని నానికి ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలను అసెంబ్లీ ఆమోదించిన తర్వాత సినీ పరిశ్రమ చేసిన విజ్ఞప్తులను సీఎం దృష్టికి మాత్రమే తీసుకెళ్లనని పేర్ని నాని చెప్పిన సంగతి తెలిసిందే. సినిమాటోగ్రఫీ శాఖ సీఎం దగ్గరే ఉండటంతో అప్పుడు పేర్ని అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా అదే శాఖ ఆయన వద్దకు రావడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. (File: Photo)