P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18 అధికార వైసీపీకి ప్రస్తుతం ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా కంచుకోటగా మారింది. గత ఎన్నికల్లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఎన్నికల తరువాత ప్రతిపక్ష పార్టి మరింత ఢీలా పడింది. దీంతో ప్రస్తుతం విజయనగరం జిల్లాల్లో అధికార పార్టీ హవాకు తిరుగులేదని చెప్పాలి. జిల్లా నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. అయితే మంత్రి బొత్సాకు ఎలాంటి గండం లేకున్నా.. మరో మంత్రి పాముల పుష్ప శ్రీవాణిపై వేటు పడక తప్పదనే ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది చివరిలో జరిగే విస్తరణలో విజయనగరం జిల్లాలో ఎవరికి పదవులు వస్తాయి అన్న దాని మీద వైసీపీలో హాట్ హాట్ గా డిస్కషన్ సాగుతోంది. సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఇక రెండవ పదవి పుష్ప శ్రీవాణిని నాడు వరించింది. ఈసారి బొత్సను అలాగే కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. బొత్సాను తప్పిస్తే జిల్లాలో రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.
ఇక పుష్ప శ్రీవాణిని మాత్రం మారుస్తారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమెను పక్కన పెట్టి సాలురు ఎమ్మెల్యే రాజన్న దొరకే ఓటు వేస్తున్నారు అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ కి మద్దతు ఇచ్చి తన అంకితభావాన్ని నిరూపించుకున్నారు. గతంలోనే ఆయనకు మంత్రి పదవి దక్కుతుంది అని ఆశించినా పదవి లభించలేదని.. ఈసిరి తప్పక జగన్ ఆశీస్సులు ఉన్నాయి అంటున్నారు.
ఆమె గిరిజనుల అభివృద్ధి విషయంలో తనకంటూ ప్రత్యేక శ్రద్ధను తీసుకుని బలమైన ముద్రను వేయలేకపోయారు అన్నదే అధినాయకత్వం ఆలోచనగా ఉందిట. అదే విధంగా ఆమె ఎస్టీ కాదు అంటూ వివాదాలు కూడా మైనస్ గా మారింది. దీనికి తోడు జిల్లాలో వైసీపీ పటిష్టతకు కూడా ఆమె చేసిన కృషి లేదని నివేదికలు ఉన్నట్టు సమాచారం. దీంతో ఆమెని తొలగిస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణదే పై చేయి. ఆయనకు అనుకూలంగా నే రాజకీయాన్ని మలచుకుంటారు. రెండవ మంత్రి పదవి కోలగట్ల వీరభద్రస్వామికి దక్కకుండా బొత్స ఇప్పటికే చక్రం తిప్పుతున్నారు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఆ పదవి వెళ్తుంది అని అంటున్నారు. దాంతో రాజన్న దొరకు మంత్రి పదవి ఇచ్చినా బొత్స దూకుడుకు ఏ మాత్రం ఆటంకం ఉండదు. దాంతో జగన్ ఆలోచనలకు బొత్స కూడా సై అంటున్నారట. సో ప్రస్తుతానికి బొత్స సేఫ్.. కానీ కోలగట్ల ఆశలు మాత్రం అడియాశలే అయ్యేట్టు కనిపిస్తున్నాయి.