AP Panchayat Elections: సీఎం జగన్కు నిమ్మగడ్డ మరో షాక్.. కొడాలి నాని శాఖలో వాటిని ఆపేయాలని ఆదేశం
AP Panchayat Elections: సీఎం జగన్కు నిమ్మగడ్డ మరో షాక్.. కొడాలి నాని శాఖలో వాటిని ఆపేయాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో షాక్ ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేయాలని ఆదేశించారు. లేకపోతే వాటి రంగులు మార్చాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో షాక్ ఇచ్చారు.
2/ 8
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేయాలని ఆదేశించారు. లేకపోతే వాటి రంగులు మార్చాలని స్పష్టం చేశారు.
3/ 8
రంగులు మార్చని పక్షంలో ఆ వాహనాలను తిప్పొద్దంటూ ఎస్ఈసీ నుంచి పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు వెళ్లాయి.
4/ 8
రేషన్ పంపిణీ వాహనాలను కూడా పూర్తిగా రంగులు మార్చిన తర్వాత తమకు చూపించాలని, అప్పుడు అనుమతి పొందిన తర్వాత మళ్లీ తిప్పాలని స్పష్టం చేశారు.
5/ 8
ఒకవేళ అలా చేయని పక్షంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రం ఈ వాహనాలను తిప్పొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
6/ 8
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, కనుక రంగులు మార్చిన వాహనాలతోనే తిప్పాలని ఎస్ఈసీ ఆదేశాల్లో పేర్కొంది.
7/ 8
గతంలో కూడా రేషన్ డెలివరీ వాహనాల మీద వివాదం తలెత్తడంతో ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో రేషన్ వాహనాల్లో సరుకులు ఇంటింటికి తీసుకుని వెళ్లవచ్చని చెప్పింది.
8/ 8
ఇప్పుడు ఎస్ఈసీ రమేష్ కుమార్ తాజాగా మరో అంశం తెరపైకి తెచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, రంగులు మార్చాలని స్పష్టం చేశారు.