ఆంధప్రదేశ్‌లో మందుబాబులకు వైఎస్ జగన్ ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే మద్యం ధరలను రెండోసారి భారీగా పెంచేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంటున్నాయి. దీంతో మందుబాబులు బార్లకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా అక్కడా రద్దీ పెరిగిపోయింది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం... బార్లలో విక్రయించే మద్యం ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు...ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర సమయపాలన విధించింది. బార్లకు అలవాటు పడిన మందుబాబులకు సర్కార్ నిర్ణయం కరెంట్ షాక్‌లా తగిలింది. పెరిగిన ధరలను కేవలం బార్లకే పరిమితం చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం ధర మాత్రం గతంలో మాదిరిగానే ఉంది. బార్లలో మద్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో మందుబాబులు ప్రభుత్వ మద్యం దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. తాజాగా ఏపీలో బార్ల లైసెన్సులు అన్నీ రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూలైలో లైసెన్సులు తీసుకున్న వారికి నోటీసులు జారీ చేస్తోంది. డిసెంబరు 31నాటికి ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులు రద్దయిపోతాయి.