ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్స్ చెప్పారు.
2/ 5
ఈనెల 20న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒక్కరోజులో 13.72 లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్లు వేసిన రాష్ట్ర వైద్య శాఖ రికార్డు సృష్టించింది.
3/ 5
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం జగన్ పనితీరును అభినందిస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది పనితీరు ప్రతి ఒక్కరూ కరోనాను ఎదుర్కనేలా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయన్నారు. స్ఫూర్తిదాయకమైన పాలన అందిస్తున్న సీఎం జగన్ కు అభినందనలు అని చిరంజీవి పేర్కొన్నారు.
4/ 5
మెగాస్టార్ చేసిన ట్వీట్ కు స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఈ ఘనతంతా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, మండల, జిల్లాస్థాయి అధికారులు, కలెక్టర్లదేనని పేర్కొన్నారు.
5/ 5
గతంలో పలుసార్లు చిరంజీవి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి పనితీరును అభినందిస్తూ ట్వీట్లు చేసిన సంగతి తెలిసందే. తాజాగా చిరు ట్వీట్ కు సీఎం స్పందించి థ్యాంక్స్ చెప్పారు.