CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఒడిషా రాజధాని భువనేశ్వర్ (Bhuvaneswar)లోని నవీన్ పట్నాయక్ నివాసంలో రెండు గంటల పాటు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. బార్డర్ విషయాలను కూడా చర్చించనున్నారు.
నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లా వచ్చారు. ఆయనకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు, ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ఇద్దరు సీఎం ల సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు, నీటి వివాదాల (Water disputes) పరిష్కారం దిశగా ఇద్దరు సీఎంలు కసరత్తు చేస్తున్నారు. ఇద్దరి మధ్య గంటకు పైగా చర్చ జరిగే అవకాశం ఉంది. తరువాత ఏడు గంటల 15 నిమిషాలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణ అవుతారు సీఎం జగన్ (CM Jagan). ఇక రేపు రాత్రి 9 గంటల ప్రాంతంలో తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్.
పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను ఆశిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న జల, సరిహద్దు వివాదాలకు పరిష్కారం వెదికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడంతోపాటు జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఇవాళ సాయంత్రం భువనేశ్వర్‌లో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు.