AMIT SHAH TO TARGET CM KCR IN MARCH FROM HYDERABAD MEETING AK
కేసీఆర్పై బీజేపీ ఫోకస్... ఈసారి పక్కా ప్లాన్
కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించిన తెలంగాణ అధికార పార్టీ... ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే అయినా... కొంతకాలంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే రాజకీయ యుద్ధం ఎక్కువగా సాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 13
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటడం... తెలంగాణలో బలహీనపడిన కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తుండటం కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 13
భవిష్యత్తులో బీజేపీతో తమకు ఎక్కువగా ముప్పు ఉంటుందని భావిస్తున్న టీఆర్ఎస్... బీజేపీని ఎదుర్కోవడానికి తమవంతు వ్యూహాలను సిద్ధం చేసి పెట్టుకుంటోంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 13
ఈ క్రమంలోనే కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించిన తెలంగాణ అధికార పార్టీ... ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 13
అయితే టీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మరోసారి కేసీఆర్ వర్సెస్ అమిత్ షా మధ్య పొలిటికల్ వార్ జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 13
వచ్చే నెలలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లోనే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 13
దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగితే... సీఎం కేసీఆర్ కేంద్రాన్ని తనదైన శైలిలో విమర్శించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 13
అయితే కేసీఆర్ ఈ విషయంలో తమను టార్గెట్ చేయడానికి ముందుగానే ఆయనను కార్నర్ చేయాలని బీజేపీ భావిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 13
ఇందుకోసం తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే హైదరాబాద్లో సీఏఏ అనుకూల సభను భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 13
మార్చి 15 ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో సభను ఏర్పాటు చేయడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 13
కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. ఆయనే సీఏఏ విషయంలో కేసీఆర్పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తారని సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
12/ 13
సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్కు అంతకంటే ముందే గట్టి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
13/ 13
మొత్తానికి అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ వ్యూహాలను చూస్తుంటే... మార్చిలో కేసీఆర్, అమిత్ షా మధ్య పొలిటికల్ వార్ ఖాయంగా కనిపిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)