AAM AADMI PARTY CM CANDIDATE BHAGWANT MANN HAS CHALLENGED CHARANJIT SINGH TO CONTEST FROM DHURI CONSTITUENCY IN THE PUNJAB ASSEMBLY ELECTIONS SNR
PUNJAB: ఇద్దరం ఒకే చోటి నుంచి పోటీ చేద్దాం..ఎవరు గెలుస్తారో చూద్దాం..
PUNJAB ELECTIONS: పంజాబ్ సీఎం చరణ్జిత్సింగ్కు ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్‌మాన్ సవాల్ విసిరారు. తాను పోటీ చేస్తున్న ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆహ్వానించారు ఆప్ నేత. చరణ్జిత్సింగ్పై వచ్చిన ఆక్రమాస్తుల ఆరోపణలకు బదులివ్వాలని సూచించారు భగవంత్‌మాన్.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. త్వరలో జరగబోయే ఈ సమరంలో ఇప్పటి నుంచే సవాళ్లు షురూ అయ్యాయి. గెలుపు, ఒటములే కాదు నీకు దమ్ముంటే నా ప్లేస్‌కి వచ్చి పోటీ చేయమనే లాజిక్ ఛాలెంజ్‌లు చేస్తున్నారు నేతలు.
2/ 6
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరును ప్రకటించిందో లేదో ఆయన అప్పుడే దూకుడు పెంచారు.
3/ 6
ప్రజల ఎంపికతో సీఎం అభ్యర్ధిగా నిలబడుతున్న భగవంత్ మాన్.. కాంగ్రెస్ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ ఛన్నీకి సవాల్ విసిరారు. చన్నీ సాహబ్ మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే నేను పోటీ చేస్తున్న ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేయండి అంటూ ఆహ్వానం పలికారు.
4/ 6
అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు చేశారు ఆప్ సీఎం క్యాండిడెట్ భగవంత్‌మాన్. సవాల్‌తో వదిలిపెట్టకుండా పంజాబ్ సీఎంపై ఆరోపణలు చేశారు.
5/ 6
చరణ్‌జిత్‌సింగ్ పేరుతో బయటపడిన 56కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులకు సంబంధించి చర్చకు రావాలని కోరారు. దీనిపై మీరు నోరు విప్పాల్సిందేనంటూ గట్టి పట్టుపట్టారు భగవంత్‌మాన్.
6/ 6
పంజాబ్ కాంగ్రెస్‌లో చీలికలతో సతమతమవుతున్న హస్తం నేతలను టార్గెట్ చేస్తున్నారు ఆప్ నేతలు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బులకు లెక్కలు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు ఆప్ నేత భగవంత్‌మాన్. దీనికి చరణ్‌జిత్‌సింగ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.