టాలీవుడ్ స్టార్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు 2019 పెద్దగా కలిసిరాలేదనే టాక్ వినిపిస్తోంది. సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ బాలయ్యకు ఈ ఏడాది చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణకు 2019 అస్సలు కలిసిరాలేదనే చెప్పాలి. అటు సినిమాల పరంగా... అటు రాజకీయంగా బాలకృష్ణకు ఈ ఏడాది చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది.
2/ 14
ఈ ఏడాది బాలయ్య మూడు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
3/ 14
అయితే ఈ రెండూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ మెప్పించలేకపోయారని ఆడియెన్స్ తేల్చేశారు. కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి పరాజయం పాలవ్వడం... నందమూరి అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపర్చింది.
4/ 14
ఈ రెండు సినిమాల ద్వారా బాలకృష్ణ... తన తండ్రి స్థాపించిన టీడీపీకి ఎన్నికల్లో ఉపయోగపడతారని చాలామంది భావించారు. కానీ అలా జరగలేదు. టీడీపీకి ఎన్నికల్లో ఎన్టీఆర్ బయోపిక్స్ ఉపయోగపడలేదు.
5/ 14
ఇక ఈ ఏడాది చివర్లో బాలకృష్ణ రూలర్‌గా ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో బాలయ్య నటించిన రెండో సినిమా కావడం... మొదటి సినిమా జై సింహ సక్సెస్ కావడంతో రూలర్‌పై నందమూరి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
6/ 14
కానీ వారి ఆశలను రూలర్ ఏ మాత్రం నెరవేర్చలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సినిమాలతో పాటు రాజకీయంగానూ బాలకృష్ణకు 2019 బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి.
7/ 14
ఆయన తండ్రి స్థాపించిన టీడీపీ... అంతకుముందు ఏడాది అధికారంలో ఉంది. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది.
8/ 14
చరిత్రలో టీడీపీ ఎప్పుడూ చూడనంత దారుణమైన ఫలితాలు... ఈసారి జరిగిన ఎన్నికల్లో వచ్చాయి. ఇక టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఇద్దరు అల్లుళ్లు ఓడిపోయారు.
9/ 14
టీడీపీని భవిష్యత్తులో లీడ్ చేయబోయే నాయకుడిగా భావిస్తున్న చంద్రబాబు కుమారుడు, బాలయ్య పెద్దల్లుడు నారా లోకేశ్... మంగళగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వైసీపీ హవాలో ఆయన కూడా ఓటమి చవిచూడక తప్పలేదు.
10/ 14
ఇక విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రత్యర్థితో హోరాహోరీగా తలపడిన శ్రీభరత్... స్వల్ప తేడాతో ఎన్నికల్లో ఓడిపోయారు.
11/ 14
అయితే ఇన్ని ప్రతికూలతల్లోనూ బాలకృష్ణకు ఈ ఏడాది కలిసొచ్చిన ఒకే అంశం... వైసీపీ ప్రభంజనంలోనూ ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడమే.
12/ 14
హిందూపురం నుంచి రెండోసారి టీడీపీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన బాలయ్య... గతం కంటే ఎక్కువగా మెజార్టీతో గెలిచారు. రాయలసీమలో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో చంద్రబాబు, పయ్యావుల కేశవ్‌తో పాటు బాలకృష్ణ కూడా ఉండటం విశేషం.
13/ 14
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ చేజారకుండా ఉన్న హిందూపురం సీటును మరోసారి ఆ పార్టీ కాపాడుకోవడంలో బాలకృష్ణ విజయం సాధించారు.
14/ 14
ఇలా ఈ ఏడాది ఎక్కువగా చేదు జ్ఞాపకాలను మూటగట్టుకున్న బాలకృష్ణ... వచ్చే ఏడాది బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటించబోయే సినిమాలో మళ్లీ బ్లాక్ బస్టర్ అందుకుంటారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.