తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని అనుభవాలు, చేదు జ్ఞాపకాలు 2019 సంవత్సరంలో ఎదురయ్యాయనుకోవచ్చు.
2/ 9
2019 జనవరిలో అప్పటి ఏపీ సీఎంగా చంద్రబాబు పింఛను రూ.2000 నుంచి రూ.3000కు పెంచారు. జగన్‌ను ఢీకొట్టేందుకు ఈ స్కీమ్ తెచ్చారు. అయినా ఆ పథకం పారలేదు. ఎన్నికల్లో ప్రజలు ఓడించారు.
3/ 9
2019 మార్చిలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పథకాన్ని తెచ్చారు. డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. మొత్తం మూడు విడుతల్లో ఈ నగదు చెల్లిస్తామన్న ఆయన రెండు విడుతల డబ్బులు ఇచ్చారు. మూడో విడుత ఎన్నికల తర్వాత ఇస్తామన్నారు. కానీ, ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.
4/ 9
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని పరాజయం ఎదురైంది. మేలో వచ్చిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి.
5/ 9
మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేష్ ఓడిపోయారు. సొంత కొడుకు లోకేష్‌ను కూడా ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారనే విమర్శను చంద్రబాబు మూటగట్టుకున్నారు.
6/ 9
టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు సైకిల్ దిగి జూన్‌లో బీజేపీ గూటికి చేరారు. రాజ్యసభలో టీడీపీ ఎల్పీని బీజేపీలో విలీనం చేస్తూ చైర్మన్ వెంకయ్యనాయుడు నోటిఫికేషన్ ఇచ్చారు.
7/ 9
కృష్ణా నది ఒడ్డున చంద్రబాబు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్‌లో ఓసారి, సెప్టెంబర్‌లో మరోసారి కూల్చేస్తామంటూ నోటీసులు వచ్చాయి. చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురై ఉండదు.
8/ 9
ఏపీ మాజీ మంత్రి, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాద్ సెప్టెంబర్ 16న ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన్ను వరుస వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నీచర్ ఎత్తుకెళ్లారంటూ జరిగిన ప్రచారం కోడెలను మానసికంగా కుంగదీసింది.
9/ 9
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన పదవికి, పార్టీకి నవంబర్‌లో రాజీనామా చేశారు. లోకేష్ తనను టార్గెట్ చేశారని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వంశీ ఆరోపించారు. దీంతో టీడీపీ వల్లభనేని వంశీని సస్పెండ్ చేసింది.