పశుసంవర్ధక శాఖ ప్రజలకు వైద్య సదుపాయాల కోసం యూపీలోని సహరాన్ పూర్లో రెండు వెటర్నరీ అంబులెన్స్‌లను ప్రారంభించారు. పశుపోషకులు ఇకపై తిరగాల్సిన అవసరం ఉండదు. పశువుల యజమానుల సౌకర్యార్థం, అస్వస్థతకు గురైన పశువుల చికిత్స కోసం జిల్లాలో రెండు సంచార పశువైద్య అంబులెన్స్‌లను ప్రారంభించారు.
2/ 7
ఈ అంబులెన్సులు 108, 102 సేవల లాగా పనిచేస్తాయి. ఇందుకోసం పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ డయల్ 1962 నంబరును కూడా జారీ చేసింది. దానిపై మీరు కాల్ చేయడం ద్వారా జంతువులకు చికిత్స ఇవ్వవచ్చు.
3/ 7
వెటర్నరీ డాక్టర్ల బృందం అక్కడికి చేరుకుని జంతువులకు చికిత్స చేస్తుంది. ఆవులు, గేదెలకే కాకుండా కుక్క, పిల్లి సహా ఇతర జంతువుల చికిత్సకు కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
4/ 7
ఈ అంబులెన్స్‌లో నైపుణ్యం ఉన్న పశువైద్యుడు, ఫార్మసిస్ట్, డ్రైవర్ ఉంటారు. వీటితో పాటు చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర వస్తువులు కూడా అంబులెన్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఘటనా స్థలానికి చేరుకుని జంతువుకు చికిత్స అందిస్తారు.
5/ 7
పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు ఏడు లక్షల పశువులు ఉన్నాయి. ప్రతి లక్ష పశువులకు ఒక సంచార పశువైద్య అంబులెన్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో యోగి ప్రభుత్వముంది. త్వరలో మరో ఐదు అంబులెన్సులు కూడా జిల్లాకు అందుబాటులోకి రానున్నాయి. పశువుల యజమానుల ప్రయోజనాల దృష్ట్యా వీటిని నిర్వహిస్తారు.
6/ 7
మన ఏపీలో కూడా ఈ రకమైన సేవలను సీఎం జగన్ ఎప్పుడో ప్రారంభించారు. ఫోన్ చేసిన వెంటనే మూగ జీవాలకు ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పెరటి కోళ్లు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా వీటిని తీర్చిదిద్దారు.
7/ 7
ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని గుర్తించిన కేంద్రం జాతీయ స్థాయిలో ఇదే విధానాన్ని అమలు చేయాలని సంకల్పించింది. అటు , యూపీ లాంటి రాష్ట్రాలు కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాయి.