ఉత్తరప్రదేశ్ న్యూస్, అయోధ్య లేటెస్ట్ న్యూస్" width="1600" height="1600" /> ఇప్పుడు దేశమంతా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. యూపీలో మళ్లీ అధికారంలోకి వస్తుందా ? సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా ? అన్న ఆసక్తి చాలామంది ఉంది. (ఫైల్ ఫోటో)
2/ 7
ఇక తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న యోగి ఆదిత్యనాథ్.. నేడు గోరఖ్‌పూర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.(ఫైల్ ఫోటో)
3/ 7
నామినేషన్‌కు ముందు గోరఖ్‌నాథ్ ఆలయంలో ఉన్న శక్తి ఆలయంలో ప్రార్ధనలు చేశారు. నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను పొందుపర్చారు.(ఫైల్ ఫోటో)
4/ 7
తన మొత్తం ఆస్తులు రూ.1 కోటి 54 లక్షల 94 వేల 54 అని సీఎం యోగి వెల్లడించారు. ఇందులో లక్ష రూపాయల నగదు ఉన్నట్లు తెలిపారు. లక్నో, గోరఖ్‌పూర్‌లోని 6 చోట్ల వివిధ బ్యాంకుల్లో 11 ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాల్లో 1 కోటి 13 లక్షల 75 వేల రూపాయలకు పైగా ఉన్నాయి.(ఫైల్ ఫోటో)
5/ 7
సీఎం యోగికి భూమి, ఇల్లు లేవు. జాతీయ పొదుపు పథకాలు, బీమా పాలసీల ద్వారా ఆయనకు రూ.37.57 లక్షలు ఉన్నాయి. ఇక సీఎం యోగి ఆదిత్యనాథ్ తన దగ్గర రెండు ఆయుధాలు ఉన్నట్టు ఆఫిడవిట్లో పేర్కొన్నారు.(ఫైల్ ఫోటో)
6/ 7
రూ.లక్ష విలువైన రివాల్వర్, రూ.80 వేల విలువైన రైఫిల్ ఉన్నాయని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నామినేషన్ వేయడం ఇదే మొదటిసారి. గతంలో ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా పని చేసిన యోగి.. ఎమ్మెల్సీ కోటాలో యూపీ సీఎం అయ్యారు.(ఫైల్ ఫోటో)
7/ 7
ఇప్పుడు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి అదృష్టం పరిక్షించుకోనున్నారు యోగి. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి.(ఫైల్ ఫోటో)