ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న శ్రీ సిద్ధారూఢ స్వామీజీ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. పిటీఐ వార్తా సంస్థ ప్రకారం, ఈ ప్లాట్‌ఫామ్‌ను రూ.20 కోట్లతో నిర్మించారు. ఇది మొత్తం 1,507 మీటర్ల పొడవు ఉంది. (Image: Twitter/mansukhmandviya)
హోస్పేట-హుబ్బళి-తినైఘాట్ రైల్వే లైన్... విజయనగర, కొప్పల్, గడగ్, ధార్వాడ్, ఉత్తర కన్నడ, బెళగావి జిల్లాల గుండా వెళుతుంది. ఇది ఉక్కు కర్మాగారాలు, థర్మల్ పవర్ ప్లాంట్లను.... మోర్ముగో (Mormugao) ఓడరేవుకు కలుపుతుంది. ఇది ప్రధాన బొగ్గు మార్గం. ఈ డబుల్-లైన్ ట్రాక్.. విద్యదీకరించడం వల్ల.. కాలుష్యం లేనట్లైంది.(Image: Twitter/mansukhmandviya)
విజయనగర సామ్రాజ్యా ఖ్యాతిని చాటిచెప్పేలా హోస్పేట రైల్వేస్టేషన్‌ను పునరాభివృద్ధి చేస్తున్నామని చెబుతోంది. కర్నాటక సామ్రాజ్యంగా పిలిచే విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలోని చాలా భాగం ఉండేది. ఇందులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, , , గోవా, , మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి. ఈ రాజ్యాన్ని 1336లో సంగం రాజవంశానికి చెందిన సోదరులు హరిహర, బుక్కరాయలు స్థాపించారు. (Image: Twitter/ShobhaBJP)