సుడిగాలిని మనందరం తరచూ చూస్తూనే ఉంటాం. అది వచ్చినప్పుడు.. చుట్టుపక్కల ఉన్న చెత్తా, చెదారం, ఎండిన ఆకులు అన్నీ గాల్లోకి లేచి.. గుండ్రంగా తిరుగుతాయి. వీటినే గాలి దెయ్యాలు అంటారు కొందరు. ఇవి దుమ్ము ఉన్న చోటే వస్తాయనీ.. అందువల్లే ఇవో రకమైన దెయ్యాలు అనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇవి అన్ని ప్రదేశాల్లో వస్తాయి. దుమ్ము ఉన్న చోట.. వచ్చినప్పుడు ఆ దుమ్ము పైకి లేచి తిరుగుతుంది కాబట్టి.. అక్కడో సుడిగాలి వచ్చిందనే విషయం మనకు తెలుస్తుంది. (image credit - twitter - @ani_digital)
ఇదే సుడిగాలి.. భారీగా వస్తే దాన్నే టోర్నడో అంటాం. మన దేశంలో టోర్నడోలు తక్కువే. అమెరికా చుట్టుపక్కల సముద్రాలపై టోర్నడోలు ఏర్పడతాయి. అవి భూమివైపు వస్తాయి. అక్కడ విశాల మైదానాలు ఎక్కువ కాబట్టి.. టోర్నడోలు వేగంగా తిరిగేందుకూ, బలం పెంచుకునేందుకూ వీలవుతుంది. ఫలితంగా వాటి విధ్వంసం అసాధారణంగా ఉంటుంది. ఇండియాలో అలాంటి టోర్నడోలు రాకపోవడానికి కొన్ని కారణాలున్నాయి.
Population density : ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఇండియా. పైగా దేశంలో చాలా ప్రాంతాలు పట్టణాలు, నగరాలుగా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతాల్లో టోర్నడోలు ఏర్పడే అవకాశాల్ని బాగా తగ్గిస్తున్నాయి. భవనాలు, నిర్మాణాలు.. గాలుల వేగాన్ని తగ్గిస్తాయి. అందువల్ల టోర్నడో ఏర్పడే వీలు ఉండదు. ఒక వేళ ఏర్పడినా.. అది చాలా చిన్నదే ఉంటుంది.
తాజాగా ఉత్తర అమెరికాలో వచ్చిన టోర్నడోలు.. మిసిసిపీ, అలబామా, టెన్నెస్సీ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఈ మూడు రాష్ట్రాలూ.. విస్తీర్ణం ప్రకారం చూస్తే.. ఇండియాలో సౌత్ ఇండియాకి సమానం. ఆ లెక్కన ఆ 11 టోర్నడోలు.. ఇండియాలో వచ్చి ఉంటే.. ఇండియాలోని , , , , తెలుగు రాష్ట్రాలపై ప్రభావం కనించేది. ఆ స్థాయిలో అక్కడ టోర్నడోలు వచ్చాయి కాబట్టే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అమెరికాలోని ఆ 3 రాష్ట్రాలూ.. ఆర్కిటిక్ మహా సముద్రానికి పక్కనే ఉంటాయి.