Parliament New Building: పార్లమెంటు కొత్త భవన నిర్మాణం ఎందుకో తెలుసా?

Parliament New Building: పార్లమెంటు కొత్త భవన నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ చేపట్టనుంది. ప్రస్తుత భవనం కంటే పెద్దదిగా దీన్ని నిర్మించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లోక్‌సభలో సరైన ప్రాతినిధ్యంకల్పించాలి. పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచితే ప్రస్తుత పార్లమెంటు భవనం సరిపోదన్న కారణంగా కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు.