శ్రద్ధా హత్య కేసును తొమ్మిది ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. శ్రద్ధావాకర్‌తో సహజీవనం చేసిన అఫ్తాబ్ నిత్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఒక రోజు వాగ్వాదం తారాస్థాయికి చేరింది. అదే రోజు ఓ ఫ్రెండ్‌ను కలవడానికి శ్రద్ధా ఫ్లాట్ విడిచి వెళ్లింది. సహజీవనం ఇంక చాలు అని.. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా పట్టుపట్టింది. అఫ్తాబ్ ఒప్పుకోకపోవడంతో గొడవ పెద్దదై ఆమెను ముక్కలు ముక్కలుగా నరికే వరకు వెళ్లింది.
[caption id="attachment_1594734" align="alignnone" width="1820"] 2019లో ఓ డేటింగ్ యాప్ ద్వారా ప్రేమలో పడ్డ శ్రద్ధా, అఫ్తాబ్ దాదాపు మూడేళ్ల పాటు సహజీవనం చేశారు. వీరి రిలేషన్‌ను శ్రద్ధా కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. అఫ్తాబ్ మంచివాడు కాదంటూ చాలా సార్లు నచ్చచెప్పింది. అయినా అప్పటికే అతని ట్రాప్‌లో పడిపోయిన శ్రద్ధా కుటుంబసభ్యుల మాటను పట్టించుకోలేదు.