Mamata Banerjee: తారా మాతను దర్శించిన మమతా బెనర్జీ... ఎన్నికల వ్యూహమా?
Mamata Banerjee: తారా మాతను దర్శించిన మమతా బెనర్జీ... ఎన్నికల వ్యూహమా?
Mamata Banerjee: మమతా బెనర్జీ జనరల్‌గా ఆలయాలకు వెళ్లరు. అలాంటి ఆమె... సరిగ్గా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తారామాతను దర్శించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
కరోనా దృష్ట్యా ఇక ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనేది లేదని చెప్పిన బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ... సడెన్‌గా తారాపీఠం ఆలయంలో ప్రత్యక్షమయ్యారు.
2/ 6
మమతా బెనర్జీ జనరల్‌గా పూజలు, వ్రతాలకు దూరంగా ఉంటారు. ఈసారి మాత్రం ఆమె... తారామాతను దర్శించి... అమ్మవారి కాళ్లపై పడి మొక్కుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయనీ... ప్రజలను అమ్మవారే కాపాడాలని కోరారు.
3/ 6
"బెంగాల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని నా తల్లిని కోరుకున్నాను. తల్లి దీవెనలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈ కరోనా భూమిని వదిలిపోవాలని కోరుకున్నాను" అని మమతా బెనర్జీ తెలిపారు.
4/ 6
"అందరూ కలిసి ఉండాలి... కలసికట్టుగా మనం చెడు శక్తులను తరిమేయాలి. బెంగాల్లో శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలి. ప్రతి ఇంట్లో అనంతమైన శాంతి రావాలి" అని మమతా బెనర్జీ కోరారు.
5/ 6
ఓవైపు దీదీ... ప్రజల క్షేమం కోసమే ఆలయ దర్శనానికి వచ్చినట్లు చెబుతుంటే... ఓట్ల కోసమే ఈ ఎత్తుగడ వేశారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.
6/ 6
ఇంతకాలం మాస్క్ పెట్టుకోకుండా ఉన్న మమతా బెనర్జీ... ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మాస్క్ పెట్టుకున్నారు. ఆలయంలో పూజారులు కూడా పెట్టుకున్నారు. కరోనా రూల్స్ పటిస్తూ మమతా బెనర్జీ ఆలయ దర్శనం పూర్తి చేశారు.