WEATHER UPDATE SEVERE SNOWFALL AND RAIN SHUTS DOWNS HIGHWAYS AND ROADS IN HIMACHAL PRADESH SHIMLA MANALI SK
Snowfall in Himachal: ఈ ఫొటోలు చూశారా.. గడ్డకట్టుకుపోతున్న హిమాచల్.. భారీగా హిమపాతం
Snowfall in Himachal:హిమాచల్ ప్రదేశంలో భారీగా మంచు కురుస్తోంది. మంచుకొండలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఐతే కొన్ని చోట్ల హిమపాతం భయంకరంగా ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. రహదారులను ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తోంది. హిమాచల్ ఎలా గడ్ట కట్టుకుపోతుందో ఇక్కడ చూడండి.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షంతో పాటు మంచు కురుస్తోంది. ఈ మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
2/ 11
సిమ్లాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో కలిసి సీఎం జై రాం ఠాకూర్ మంచు ముద్దలను పట్టుకొని సందడి చేశారు.
3/ 11
కొందరు మంత్రులు, బీజేపీ నేతలు కూడా సీఎంతో పాటు ఉన్నారు. ఈ హిమపాతం వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.
4/ 11
మంచు వర్షం ధాటికి హిమాచల్ ప్రదేశ్‌లో 434 కనెక్టివిటీ రోడ్లను మూసివేశారు. వీటితో పాటు 3 జాతీయ రహదారులు, ఒక స్టేట్ హైవేపైనా రాకపోకలను నిలిపివేశారు.
5/ 11
మంచు విపరీతంగా కురుస్తుండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయి. అంతేకాదు 79 వాటర్ ప్రాజెక్టులు కూడా స్తంభించిపోయాయి.
6/ 11
హిమాచల్‌లోని లాహోల్ స్పితిలోని సిసు ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. దాదాపు 6-7 అంగుళాల మేర పేరుకుపోయింది.
7/ 11
ప్రస్తుతం సిస్సు నుంచి సౌత్ పోర్టల్ క్యాంపస్ ప్రాంతానికి పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. ఐతే సౌత్ పోర్టల్ నుంచి మనాలి వైపు వెళ్లే రహదారిని మాత్రం మూసివేశారు.
8/ 11
హిమాచల్‌లోని కులు మనాలిలో కూడా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. మంచు కూడా విపరీతంగా పడుతోంది.
9/ 11
మనాలిలోని పల్చన్, నెహ్రూ కుండ్లలో భారీగా మంచు కురుస్తోంది. అదే సమయంలో మనాలిలో వర్షం పడుతుండడంతో పర్యాటకుల వాహనాలను నెహ్రూకుండ్ వరకు మాత్రమే అనుమతిస్తున్నారు.
10/ 11
మంచులో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు
11/ 11
సోలాంగ్ పాస్ వద్ద బీఆర్వో సిబ్బంది రోడ్డుపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలను నెహ్రూ కుండ్ వరకు మాత్రమే అనుమతిస్తున్నారు.