జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ విధానంపై కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత వాహనాలను స్క్రాప్ (తుక్కు)కి ఇచ్చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్‌లో 25 శాతం దాకా రిబేట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
పాత వాహనాల వలన కర్భన ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి. అవి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి.ఈ క్రమంలోనే స్క్రాపేజీ పాలిసీ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ టెస్టింగ్ తప్పనిసరి కానుంది. మిగతా కేటగిరీల వాహనాలకు 2024 జూన్ 1 నుంచి దశలవారీగా అమలు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)